విజయనగరం:వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. వివేకానంద హత్య ఏపీలో సాగుతున్న హత్యా రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. సీబీఐ విచారణ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారన్నారు.టీడీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.