మొండితోక సోద‌రుల‌పై అక్రమ కేసు 

ఎన్టీఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌పై అక్ర‌మ కేసు న‌మోదు చేశారు. ఈ నెల 2వ తేదీ నందిగామ‌లో వైయ‌స్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించినందుకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. వైయ‌స్ఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని స్థానికంగా అన్న‌దాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. 
అన్నదానం చేసేందుకు సిద్ధం చేసిన టేబుల్స్ , వాటర్ క్యాన్లను లాక్కెళ్లిపోయారు. ప్రజలకు అసౌకర్యం , ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని మాజీ ఎమ్మెల్యే జ‌గ‌న్‌మోహ‌న్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

Back to Top