కేతిరెడ్డికి హైకోర్టులో ఊర‌ట‌

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏపీలో హైకోర్టులో ఊరట దక్కింది. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసును హైకోర్టు విచారించింది. తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
ఈ సందర్భంగా అనంతపురం పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 18వ తేదీన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు .. ఆయనకు పోలీసులే భద్రత కల్పించాలని సూచించింది.  

Back to Top