హైదరాబాద్: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన సీపీఐ అగ్రనేత, పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల అంతిమ దర్శనం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివదేహాన్ని మఖ్దూం భవన్‌లో ఉంచారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. అక్కడ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించి, సురవరం సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.