సుగాలి ప్రీతి కేసులో అసలు నిజాలు బయట పెట్టాలి

ప్రీతి త‌ల్లి వీల్ చైర్ యాత్ర‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?

వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు సాకే శైల‌జనాథ్ సూటి ప్ర‌శ్న‌

క‌ర్నూలు:  సుగాలి ప్రీతి కేసులో అస‌లు నిజాలు బ‌య‌ట పెట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు సాకే శైల‌జనాథ్ డిమాండ్ చేశారు. ఈ బాధ్య‌త పోలీస్ డిపార్ట్మెంట్, కూట‌మి ప్రభుత్వంపై ఉంద‌ని గుర్తు చేశారు. సోమ‌వారం క‌ర్నూలులో సుగాలి ప్రీతి కుటుంబ స‌భ్యుల‌ను మాజీ మంత్రి శైలజానాథ్ ప‌రామ‌ర్శించారు. ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు.  అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..`న్యాయం కోసం అధికార పార్టీ ప్రభుత్వాన్ని ప్రీతి కుటుంబ అడుగుటంలో తప్పేముంది. న్యాయం కోసం ప్రీతి త‌ల్లి వీల్ చైర్ యాత్ర చేపట్టితే ప‌ర్మిష‌న్ లేద‌ని, డీజీ ఈ కేసు డీల్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆమె గొంతును నొక్కే పరిస్థితి ఏర్పడింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమె యాత్రను అడ్డుకుంటున్నారు. ఆమె యాత్రకు అనుమతి ఇవ్వాలి, ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపాలి. న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిపై వేధింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణ కరువైంది, ప్రీతి కుటుంబ సభ్యులతో డీజీని కలుస్తాం. ‌ప్రీతి సమస్యను వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాల్సిన కూటమి ప్రభుత్వానికి ఉంది. ప్రీతి కుటుంబానికి ప్రజల మద్దతు ఎంతో అవసరం‌ ఉంది. ఈ సమస్యపై వ్యక్తి గతంగా పోరాడుతాను` అని శైల‌జనాథ్ స్ప‌ష్టం చేశారు. 

Back to Top