గ‌డ‌ప గ‌డ‌ప‌కు ఘ‌న స్వాగ‌తం

అనంత‌పురం:  ప్ర‌భుత్వం చేసిన  మంచి ప‌నుల‌ను వివ‌రించేందుకు చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని 9 వార్డ్ లో 3వ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో  మడకశిర శాసనసభ్యులు డాక్టర్ ఎం తిప్పేస్వామి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి  ప్రజాసమస్యలను అడిగి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నలిని, మున్సిపల్ చైర్మన్ తనయుడు జయరాజ్, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వైస్ చైర్‌ప‌ర్స‌న్‌ వెంకటలక్ష్మమ్మ, బోయ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ,  కృష్ణమూర్తి, ఆవుల శీనప్ప , వార్డు కౌన్సిలర్లు  సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Back to Top