తాడేపల్లి: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రేపటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు యథావిధిగా నడుస్తాయని ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.