మ‌త్స‌కారుల ఇళ్ల‌ను త‌గల‌పెట్టించిన చ‌రిత్ర కొల్లు ర‌వీంద్ర‌ది

చంద్ర‌బాబు, లోకేష్‌కు మ‌తి భ్ర‌మించింది

ప్ర‌భుత్వ విప్ దాడిశెట్టి రాజా 

తాడేప‌ల్లి : మ‌త్స్య‌కారుల ఇళ్ల‌ను త‌గ‌ల‌బెట్టించిన చ‌రిత్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు ర‌వీంద్ర‌ద‌ని ప్ర‌భుత్వ విప్ దాడిశెట్టి రాజా విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు లోకేష్‌కు మ‌తి భ్రమించింద‌ని అందుకే ప్ర‌భుత్వంపై కుట్ర‌లు చేస్తున్నారని  మండిప‌డ్డారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌  30 ల‌క్ష‌ల ఇళ్ల స్థ‌లాల‌ను పేద‌ల‌కు ఇస్తుంటే టీడీపీ కుట్ర చేస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.   చంద్ర‌బాబు హయాంలో ఓరిగిందేమీ లేద‌ని  రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ కోస‌మే చంద్ర‌బాబు  తాప‌త్ర‌యం ప‌డ్డారు త‌ప్పా పేద‌ల గురించి ఆలోచించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా బాబు హ‌యాంలో పేద‌ల‌కు ఒక్క ఇళ్ల నిర్మాణం కూడా జ‌ర‌గ‌లేద‌ని గుర్తుచేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ను అడ్డుపెట్టుకొని టీడీపీ నేత‌లు కుట్ర‌లు చేశారు కానీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంది అని రాజా  పేర్కొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top