రేపు తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు మిచౌంగ్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.  తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సమ‌యంలో వరద బాధితులను పరామర్శించ‌నున్నారు. పంట నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు స‌మాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరిశీలించనున్నారు. తుపాన్ స‌మ‌యంలో ప్రభుత్వం అందించిన సాయంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్వయంగా బాధితుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకోనున్నారు. 

Back to Top