ఎమ్మెల్యే భూమనకు సీఎం వైయ‌స్ జగన్‌ పరామర్శ

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుప‌తి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని పరామర్శించారు. రెండవసారి కరోనా సోకి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతున్న భూమనకు శనివారం ఉదయం సీఎం ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం వైయ‌స్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top