తాడేపల్లి: దూరదర్శన్ మొదటి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్ మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్ కుటుంబానికి సంతాపం తెలిపారు.