పశ్చిమ గోదావరి జిల్లా: చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెం మండలంలో మంగళవారం వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైయస్ జగన్ పిలుపు మేరకు బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమంపై పార్టీ మండల అధ్యక్షులు కర్పూరం గరయ్య గుప్తా, ఓరుగంటి నాగేంద్ర అధ్యక్షతన రాజారాణి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కంభం విజయ రాజు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్, బత్తిన నాగలక్ష్మి, జెట్టి గురునాథ రావు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కీసరి సరితా విజయ భాస్కర్ రెడ్డి , బి.వి.ఆర్ చౌదరి, ఉభయ గోదావరి జిల్లా బూత్ కమిటీ కోఆర్డినేటర్ కాసర తులసి రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి, మండవల్లి విజయ సారధి తదితరులు పాల్గొన్నారు.