ఏపీ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌లో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని వినిపించే విజయసాయి రెడ్డి స్పోర్ట్స్‌ రంగంలోకి రావడం శుభపరిణామం అని, రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను విజయసాయి రెడ్డి తీసుకోవాలని సభ్యులు ఆకాంక్షించారు.

 

Back to Top