వలస కార్మికులకు భారీ ఊరట

వలస కార్మికులకు ఉచితంగా రవాణా, భోజన సదుపాయాలు 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్తున్న వలస కార్మికులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో వలస కార్మికులకు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. వలస కార్మికులకు ఉచితంగా రవాణా, భోజన సదుపాయాలు కల్పించింది. నిన్న  ఒక్క రోజే శ్రీకాకుళం, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి సుమారు 900 మంది కూలీలను సురక్షితంగా ఆయా రాష్ట్రాలకు  ఏపీ ప్రభుత్వం పంపించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి మరో 500 మందిని పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణం సాఫీగా సాగేలా ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అధికారులు మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ చర్యలతో వలస కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Back to Top