గుంటూరు: రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు భద్రత కరువైంది. రోజుకో అఘాయిత్యం వెలుగులోకి వస్తున్నాయని ఈ తరుణంలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్..మీరు సరస్వతి భూముల పరిశీలనకు కాదు వెళ్ళవలసినది, బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాలను పరామర్శించాలని ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు సూచించారు.