సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపిన ఎంఆర్‌పీఎస్ నాయ‌కులు

తూర్పు గోదావ‌రి:  మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. ఇవాళ  తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి   వైయస్.జగన్ ను ఎమ్మార్పీఎస్ పౌండర్ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య మాదిగ‌, మాదిగ మహాసేన పౌండర్ ప్రెసిడెంట్ కె ప్రేమ్ కుమార్, ఏపీ మానవహక్కుల కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ జి.శ్రీనివాస్, మాదిగ ఇంటలెక్ట్యువల్ ఫోరమ్ ప్రతినిధి జి బాపిరాజు, దళితసేన ప్రతినిధి రావి ప్రకాష్ లు క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను  ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు క‌లిశారు. రామకృష్ణంరాజును వైయ‌స్ జ‌గ‌న్‌ ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

Back to Top