రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తోంది

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ 

రాజ‌మండ్రి: ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంటికేనని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్‌ జోస్యం చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తోందని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మేనిఫెస్టోని మాత్రమే ఎన్డీఏ కూటమి పార్టీ అయిన టీడీపీ విడుదల చేసిందని.. దానిని బీజేపీ కనీసం ముట్టుకోలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. చంద్రబాబు పేరు ఆల్ ఫ్రీ బాబు అంటూ విమర్శించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు స్వతహాగా ఒక ఆలోచన ఉండదు.. అన్ని పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొడతాడని విమర్శించారు. బీజేపీ చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో నమ్మదని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోలో వేలం పాట తరహాలో పథకాల మొత్తం పెంచుతున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంటికేనని జోస్యం చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తోందని సంచనల వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మూడు సిలిండర్లు ఇస్తే జన్మభూమి కమిటీలు పట్టుకుపోతారని విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో పేపర్ మిల్లు లాంటి పరిశ్రమలు మరో రెండు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో రాజమండ్రిలో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు మార్గాని భరత్‌ రామ్‌. 
 

Back to Top