గోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి

కోనసీమ ముఖద్వారంలో పోటెత్తిన జనప్రహావం

 
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాక‌తో గోదార‌మ్మ  సాక్షిగా రావుల‌పాలెంలో జ‌న గోదావ‌రి ఉప్పొంగింది. కోత్తపేట నియోజకవర్గం రావులపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ బస్సుయాత్ర.
మండుటెండలోనూ ముఖ్యమంత్రి  వైయస్.జగన్ కు ఘనస్వాగతం పలికిన గోదావరిప్రజలు.

తమ అభిమాన నేత కోసం బారులుతీరిన పసిపిల్లలు తల్లులు సహా, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదాతలు.
బస్సుయాత్రలో కిలోమీటర్ల మేర ముఖ్యమంత్రితో పాటు కదిలిన యవత.
రావులపాలెం ప్రధాన రహదారిలో రోడ్డుపై బారులు తీరిన మహిళలు, యువత.

Back to Top