విశాఖ: ఒక్కో బిందువు కలిసి సింధువు అయినట్లు ‘మేమంతా సిద్ధం’ యాత్రకు తరలివ చ్చిన జనసందోహం సాగరాన్ని తలపించింది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ చుట్టుపక్కల ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. ఉ.6 గంటలకే జాతీయ రహదారి వెంట అశేష జనవాహిని తమ అభిమాన జననేత కోసం వేచి చూశారు. అడుగడుగునా మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల జయజయధ్వానాలు, జగన్నినాదాల మధ్య సీఎం బస్సుయాత్ర 20వ రోజు ఆదివారం చిన్నయపాలెం నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైయస్.జగన్ 20వ రోజు బస్సుయాత్ర. పెందుర్తి నియోజకవర్గం పినగాడి జంక్షన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ కు ఘనస్వాగతం పలికిన విశాఖవాసులు. వేల సంఖ్యలో బారులు తీరిన జనం. ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సు యాత్రకు మేమంతా సిద్ధం అంటూ కదం తొక్కిన ప్రజలు. బస్సు దిగి ప్రజలతో మమేకమైన ముచ్చటించిన ముఖ్యమంత్రి, అనంతరం బస్సుపైకి ఎక్కి ఆత్మీయ స్వాగతం పలికిన అశేష జనవాహినికి అభివాదం చేసిన సీఎం వైయస్.జగన్. బస్సు దిగి నేరుగా ప్రజలతో ముచ్చటిస్తూ.. మమేకమైన ముఖ్యమంత్రి. పెందుర్తి మండలం రాంపురం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ రోడ్ షో. ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి. వేపగుంటలో జనసునామీ. పెందుర్తి మండలం వేపగుంట జంక్షన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ రోడ్ షో. దారిపొడవునా బారులు తీరి ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు. అభిమాన నేత కోసం మండుటెండను సైతం లెక్కచేయని జనం. ఆరేళ్ల పసిపిల్లల నుంచి బారులు తీరి నిల్చున్న అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు. బస్సు పై నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి. దారిపొడవునా ముఖ్యమంత్రితో పాటు ప్రవాహంలా కదిలిన జనం. చామలాపల్లి వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా హాజరైన దివ్యాంగులు. అన్నా నేటి మా చూపూ నీవే... రేపటి మా ఆశా నువ్వే.