శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు

Designation: 
అధ్యక్షులు
Location: 
పులివెందుల

దేశ రాజకీయాల్లో విప్లవం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవశకం... కాంగ్రెస్ అనే భారతదేశ అతిపెద్ద పార్టీకి నూట పాతికేళ్ల నిండు చరిత్రలో ఎన్నడూ ఎదురుకాని పెను సవాలు. ఇవన్నీ యెడుగూరి సందింటి జగన్మోహన్‌రెడ్డికి పర్యాయ పదాలు. జన హోరుని చూసి మైమరచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. సినిమాల్లో విలన్ల ముందు తిప్పినట్టు జనం ముందు మీసాలు మెలేసే పాతకాలపు కథానాయకుడు అసలే కాదు. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు. తన తండ్రి పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నవాళ్లు ఆ చెట్టు మీదే రాళ్లేస్తుంటే సహించలేకపోయిన నిజమైన వారసుడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఇసుమంతైనా తెలీని శక్తులు తనపైనా, తన విశ్వాసాలపైనా ఆధిపత్యం చెలాయించబోతే ఎదురు తిరిగిన నిజమైన విప్లవకారుడు. అందుకే ఇపుడాయన హీరో. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానిస్తున్న నిజమైన కథానాయకుడు. ఈ రోజు ఆయన ఒక శక్తి. వైయస్‌ఆర్ లేరు... ఇక తమని ఆపేవారెవరు..? అని గంతులేయబోయిన దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం. ఇపుడు ఆయన పేరు తలవనిదే ఆయనను అభిమానించే వారికే కాదు శత్రువులకూ రోజు గడవదు.

Back to Top