కర్నూలు: అన్నా..గత మూడు నాలుగేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రావడం లేదు. పంట దిగుబడులు ఆటికాటికే. పోనీ మార్కెట్లో అయినా గిట్టుబాటు ధర వస్తోందా అంటే అదీ లేదు’ అని పలు గ్రామాలకు చెందిన అన్నదాతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తమ ఆక్రందన వినిపించారు. వైయస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర లో గుడేకల్‌కు చెందిన లింగన్న, ఎమ్మిగనూరుకు చెందిన సోమన్న, ఇతర రైతులు వైయస్ జగన్‌ను కలిశారు. పంటల సాగు సమయంలో వర్షాభావం, తెగుళ్లు తదితర ప్రకృతి వైపరీత్యాలతో కంది, శనగ, పత్తి సాగులో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. దీనికి తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులంతా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ తెలుగుదేశం హయాంలో వ్యవసాయం కలిసి రావడం లేదని, దీనికి తోడు ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తోందని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తామని వైయస్ జగన్‌భరోసా ఇచ్చారు.<br/><br/>