ఈ మధుర క్షణాన్ని ఎన్నటికీ మరచిపోలేం
విశాఖపట్నం : గురువారం రాత్రి మా వివాహం జ‌రిగింది. వైయ‌స్ జ‌గ‌న‌న్న మా దంపతులను మొదట ఆశీర్వదించారు . పాదయాత్రగా ఇటువస్తున్న ఆయన ఆశీర్వాదం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. అసలు మేం ఊహించలేదు. ఈ మధుర క్షణాన్ని ఎన్నటికీ మరచిపోలేం. మాలాగే మరెందరికో ఆయన సహకారం, ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నాం.  – రాజాన నరేష్, శృతి నూతన దంపతులు, పురుషోత్తపురం, యలమంచిలి మండలం

నా పుట్టినరోజున అన్న ఆశీర్వదించారు ..
ఈరోజు నా పుట్టినరోజు. నేను ఇంటర్‌ చదువుతున్నాను. జగనన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ రోజు కొప్పాక వస్తున్నారని తెలిసింది. ఎలాగైనా అన్నను కలవాలి అనుకున్నా. 20 కి.మీ.దూరం అనిపించలేదు. నా ఆశ నెరవేరింది. అన్నయ్య అక్షింతలు వేసి ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను.– ఆర్‌.సుచరిత, రాచపల్లి, మాకవరపాలెం మండలం
Back to Top