విశాఖ: మహానేత, జననేత ఇద్దరి కలవడం సంతోషంగా ఉందని విశాఖ జిల్లాకు చెందిన పాపమ్మ అన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డితో కలిసి విశాఖపట్నంలో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశంలో పాల్గొని వైయస్‌ఆర్ పక్కనే కూర్చొని ఆయనతో కలిసి భోజనం చేశానని, మళ్లీ ఆయన తనయుడు జననేత వైయస్ జగన్‌ను పాపమ్మ కలిశారు. వైయస్ జగన్‌ను కలవడం సంతోషంగా ఉందన్నారు. రాజన్న రాజ్యం కావాలని మళ్లీ రావాలని, మళ్లీ నాన్నగారిలా అభివృద్ధి చేయాలని చెప్పానన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.. మీరు దిగులుపడొద్దు అని భరోసా ఇచ్చారన్నారు. వైయస్‌ఆర్, వైయస్ జగన్‌లను కలవడం సంతోషంగా ఉందన్నారు.