ఈబీసీలకు విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు అందించాలి

గుంటూరు: విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లను వెనుకబడిన విద్యార్థులకూ వర్తింపజేయాలని విద్యార్థి సంఘం నాయకులు నవులూరి గోపిరెడ్డి జగన్‌ను కోరారు.  గుంటూరు జిల్లాలో విద్యార్థులు జననేతను కలిశారు. ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించలేకపోతున్నారని తెలిపారు. ఈబీసీలకు సైతం స్కాలర్‌షిప్‌లు అందేలా చూడాలని కోరారు. ప్రత్యేక హోదా ద్వారానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా పోరుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

Back to Top