ప్రభుత్వంలో స్పందన లేదు

చిత్తూరు:  నాపేరు వెంక‌ట‌రెడ్డి, మాది ప‌ర‌దేశీప‌ల్లి, నాకు, మా తండ్రి డేగల వేమారెడ్డికి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. నాకు అంగళ్లు డీసీసీబీ బ్యాంకులో రూ.50 వేలు, మా తండ్రికి రూ.60 వేలు పంట రుణం ఉంది. 2013 ఫిబ్రవరిలో వేరుశనగ కింద ఈ రుణం తీసుకున్నాం. ఇద్దరికీ అర్హత ఉన్నా మాఫీ కాలేదు. రైతు సాధికారిక సంస్థకు కూడా ఫిర్యాదు చేశా. లెక్కలేనన్ని సా ర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లా. ప్రభుత్వంలో స్పందన లేదు. మాకు ఇద్దరికీ క్రాఫ్‌ లోను ఉన్నట్లు డీసీసీబీ బ్యాంకు  ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు. రికార్డులు సక్రమంగా ఉన్నా యి. అయినా ఇంత వరకు మాఫీ ఊసే లేదు
Back to Top