నేడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ షెడ్యూల్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని కోరుకొండ జంక్ష‌న్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. ఇచ్ఛాపురం మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద ప‌బ్లిక్ మీటింగ్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం గాజువాక నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేరుకుంటారు. గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలోని పాత గాజువాక సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగిస్తారు. 

Back to Top