వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు విమానాశ్రయంలో వైయస్ఆర్ సీపీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, స్థానిక వైయస్ఆర్ సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి సీఎం వైయస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. భాకారపురంలోని సీఎస్ఐ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించిన అనంతరం పులివెందుల వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా సీఎం వైయస్ జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.