తెలుగు తమ్ముళ్ల కుయ్యో మొర్రు...

కోయ దొరల జోస్యాలతో దేశ రాజకీయాలే మారిపోతున్నాయట. రాజకీయ నాయకుల వేషాలు కట్టి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పే కాల’అజ్ఞాపు’ దొరలు కొందరు తయారయ్యారు. వీళ్లు కొండ కోనల నుంచి రాలేదు. మూలకలు వాసనలు తెలియవు. తెలిసిందల్లా ఒక్కటే ఆ రాజకీయం. అరాజకీయం. అరాచకీయం. స్వలాభం కోసం సొంత ప్రజలను రోడ్డుకీడ్చగలరు. వ్యవహారం  చెడుతోందని తెలిస్తే వేషాలు కట్టి రోడ్డెక్కగలరు. 
ఈమధ్య అలాంటి ఓ కోయదొర పార్లమెంటు ముందు కొచ్చాడు. జరిగింది, జరగబోయేది చెబుతున్నా కుర్రో కుర్రు అన్నాడు. ఎన్టీఆర్ తో పెట్టుకోవద్దని ఇందిరా గాంధీకి చెప్పా, ఎపితో పెట్టుకోవద్దని సోనియాతో చెప్పా, చంద్రబాబుతో పెట్టుకోవద్దని ఇప్పుడు మోడీతో చెబుతున్నా కుర్రోకుర్రు అన్నాడు. జరిగిపోయినవి, జరగబోయేవి సరే జరుగుతున్నవి చెప్పవయ్యా అని అడిగారు కొందరు...చేతిలో కర్రని అటూ ఇటూ తిప్పి ఇట్టా చెప్పుకొచ్చాడా కోయదొర...
బభరాజమానం భజగోవిందం...
ప్రత్యేకహోదా పై పిల్లిమొగ్గల చందం...
పైకొకటింటది లోపలింకోటి జరుగుతది...
కనకదుర్గమ్మమీద ఆన, కరకట్టమీద కథ ఉన్నది సానా...
గడ్డపు బుర్రల్లో తొర్రున్నది లోన...
ఇచ్చుపుచ్చుకోవడాల మధ్య రహస్య దోస్తానా...
రెండటు...రెండిటు...ఇవి పైనా కిందా తాంబూలాలు..
తెల్సుకోలేరు మీరు మధ్యమధ్య ఒప్పందాలు...
కుర్రో కుర్రు..
ఇదండీ సంగతి....లోగుట్టు పెరుమాళ్లకెరుక అంటారు...కానీ రాజీనామాలు ఆమోదం పొందుతాయో లేదో కూడా మంత్రుల కెరుక అంటే...అంతా అనుకున్నట్టే...సాగుతోంది కదా...తొందరెందుకు చూద్దాం తెరతీసిన నాటకానికి తెరపడే రోజు ఒకటుంటుంది కదా.

 

తాజా వీడియోలు

Back to Top