నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు..

కుట్ర, కుతంత్రాల పునాదులతో సామ్రాజ్యాన్ని నిర్మించిన నారా వారి నయవంచక ఉదంతాలు అన్నీఇన్నీకావని చ్రరిత చెప్పిన నిజం. వంచన రాజకీయాలకే వన్నె తెచ్చిన ఘనుడుగా ప్రసిద్ధి చెందిన చంద్రతేజం నేడు మసక బారుతోంది. ఈ పచ్చనేత దుష్టపాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. బాబూ గారి పాలనను దుమ్మెతిపోస్తూ ప్రజలు ఈసడించుకుంటున్న ఇసుమంతా పశ్చాత్తాపం కూడా బాబు గారి ఫేసులో కనబడటం లేదు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అనే రీతిలో మాయా మాటలతో ముందుకు బ్రహ్మాండంగా సాగిపోతున్నారు పచ్చనేత. తండ్రి లాంటి సొంత మామపైకే వెన్నుపోటు కత్తి దూసి ఆయన మరణానికి కారణమైన నారా వారి లీలలు చ్రరితలోనే మచ్చగా మిగిలిపోతాయి.

చంద్రబాబు నక్కజిత్తుల చాణిక్యం.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బావమరిది హరికృష్ణను కూరలో కరివేపకులా వాడుకుని పక్కన పడేసిన  నక్కజిత్తుల చాణిక్యం చంద్రబాబుకే చెల్లింది. తన బావ చంద్రబాబు లోపాయికారి కుయుక్తులను, తన తండ్రి ఎన్టీఆర్‌కు చేసి నమ్మకద్రోహాన్ని లోలోపల కూమిలిపోతూనే పైకి గాంభీర్యం  ప్రదర్శించిన హరికృష్ణ చివరివర‌కూ మానసిక సంఘర్షణతో నలిగిపోతూనే ఉన్నారు. ఒకసారి చ్రరితలోకి వెళ్లితే 1999 ఎన్నికల ముందు చంద్రబాబును హరికృష్ణ  తీవ్రస్థాయిలో తూర్పారబట్టిన చీకటి జ్ఞాపకాలు ఒకసారి పరిశీలిస్తే వాస్తవాలు కళ్లముందు కదలాడతాయి. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార కేంద్రంగా మార్చివేసిన ఘనత చంద్రబాబుకే చెల్లిదంటూ ఆనాడు ఒక పత్రిక ఇంటర్వ్యూలో హరికృష్ణ చేసిన విమర్శలు చంద్రబాబు దుష్ట రాజకీయాలకు అర్థం పడుతోంది. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే నేడు  ఇంటెలిజెన్స్‌ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎవరూ అభ్యర్థులుగా ఉండాలో చెప్పే దుస్థితికి చంద్రబాబు పార్టీని తీసుకువచ్చారంటూ హరికృష్ణ చంద్రబాబును కడిగిపారేయడం ఆయ‌న‌ నైజం ఆనాడే తేటతెల్లమైంది. హ‌రికృష్ణ కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎక్క‌డ త‌న‌కు, త‌న కుమారుడు లోకేష్‌కు అడ్డుప‌డ‌తారో అన్న భ‌యంతో ఏ నాడు కూడా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు తీసుకోలేదు. తండ్రి చ‌నిపోయిన త‌రువాత వారి సానుభూతి పొందేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు.  ఇక   మైనారీటీలను వంచించిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వెళతారని ఆనాడు ప్రశ్నించిన తీరు ఈనాడు మైనార్టీల దుస్థితి, ముస్లింలపై టీడీపీ దౌర్జన్యాలు, చంద్రబాబు నీరో చేష్టలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. పేదవాడి గూడు, గుడ్డ, కడుపు నిండా తిండి అనే  మౌలిక సూత్రాలు చంద్రబాబు విస్మరించాడనే వాస్తవం నేటికి కొనసాగుతూనే ఉంది.

దేవినేని చెప్పిన నిజం.
ఇటీవల పచ్చమీడియాలో  దేవినేని నెహ్రూ ఇంటర్వ్యూ లో ఒక భాగం సోషల్‌ మీడియాలో చకర్లు కొడుతోంది. ఎన్టీఆర్‌ హయాంలో ఆయన కేబినెట్‌ మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు వెన్నుపోటు చర్యల్ని, వైస్రాయ్‌ హోటల్‌ ఉదంతాన్ని వివరించారు. ఎన్టీఆర్, హరికృష్ణలను రాయలేని పదాలతో బూతులు తిట్టడాన్ని వివరించడం చంద్రబాబు అసలు స్వరూపం ఏమిటన్నది తెలుస్తోంది. తోడ‌ల్లుడు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర్లు కూడా చంద్ర‌బాబు అస‌లు నిజ‌స్వ‌రూపాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసినా ఆయ‌న నాకేంటి సిగ్గు అన్న‌ట్లుగా వ్య‌వ‌హిస్తున్నారు.  అలాగే కాపు నాయ‌కుడు వంగ‌వీటి రంగ‌ను హ‌త్య చేయించింది చంద్ర‌బాబే అని ఆయ‌న కేబినేట్‌లోని అప్ప‌టి హోం మంత్రి హ‌రిరామ‌జోగ‌య్య త‌న జీవిత చ‌రిత్ర‌లో రాసుకున్నారు.

అయినొళ్లే అస‌హ్యించుకుంటున్నారు..
చంద్ర‌బాబును అయినొళ్లే అస‌హ్యించుకుంటున్నారు. నాడు స్వ‌ర్గీయ ఎన్‌టీ రామారావు చంద్ర‌బాబును మేక వ‌న్నే పులి అని అభివ‌ర్ణించారు. హ‌రికృష్ణ‌, ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర్లు బ‌హిరంగంగా విమ‌ర్శించారు.  ఇక‌ చంద్ర‌బాబు నైజాన్ని ఆయ‌న సొంత త‌మ్ముడైనా నారా రామ్మూర్తి నాయుడు కూడా బ‌హిరంగంగా ఎండ‌గ‌ట్టారు. ఇలా సొంత కుటుంబ స‌భ్యులే బాబు గారి తీరును క‌డిగి పారేస్తున్నా..ఆయ‌న‌లో ఏమాత్రం మార్పు రావ‌డం లేదు. 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీ, ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌ట్టి అధికారంలోకి రాగ‌లిగారు.  ఇప్పుడు తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్‌తో పొత్తుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.  ఇలాంటి వ్య‌క్తికి ప్ర‌జ‌లు స‌రైన స‌మ‌యంలో గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయం.

 
Back to Top