కరకట్ట కొంప కొల్లేరు

తన ఇనప పాదం మీద గట్టి నమ్మకం ఉన్నవాడు కనుకే చంద్రబాబు 5 ఏళ్లుగా కరకట్ట మీద కాపురం ఉంటున్నాడు।। 
కాకపోతే ఎవ్వరికి అంత ధైర్యం ఉంటుంది?? 
వానొచ్చినా, వరదొచ్చినా మునిగిపోయే ముంపు ప్రాంతంలో ఉన్నాడంటే తాను ఉన్నంతకాలం ప్రకృతి కూడా పని చేయదనే ఆ నమ్మకంతోనే కదా!! 
బాబు జమానాలో కరువు, తుఫానులు తప్ప వర్షాలు, ప్రాజెక్టులు నిడటం అన్నది కలలో మాట కదా।।।
కాలం మారింది। 
నారా నాయుడు ఓడి అధికారం ఊడిన తర్వాతే రాష్ట్రం మీద వరుణుడు కరుణ చూపించాడు।
కుప్పలు తెప్పలుగా వర్షాలు కురిపించాడు
ఇన్నాళ్లూ తనను రాకుండా ఆపిన బాబు కరకట్ట కొంప మీద విరుచుకు పడ్డాడు
దాంతో సముద్రాన్ని కంట్రోల్ చేసే బాబు కాళ్ళ కిందకు నీళ్ళొచ్చేశాయ్ 
కొంపలో సామానంతా సెకండ్ ఫ్లోరుకు షిఫ్ట్ అయిపోయాయి 
పదవిలో ఉన్నప్పుడు అంటే  తుఫానులను టెక్నాలజీతో ఆపాడు కానీ ఇప్పుడు మాత్రం ఇసుక బస్తాలు అడ్డు పెట్టి వరద నీరు ఆపే ప్రయత్నం చేస్తున్నాడు
వల్లకాక పోవటంతో తట్టా బుట్టా సర్దుకుని కరకట్ట నుండి హైదరాబాద్ కు ప్రయాణం కట్టాడు। 
బళ్ళు అన్నీ తీసి హోటల్లో పెట్టాడు। 
అక్రమ నివాసం లో ఉండకూడదని నోటీసులిస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు, వరద దెబ్బకు వెనక్కి తిరిగి చూడకుండా తెలంగాణాకు పరుగు పెట్టాడు।
ఇప్పటికైనా చంద్ర బాబుకు అక్రమ నిర్మాణాలు ఎంత ప్రమాదకరమో తెలిసిందో లేదో!!
ప్రజా వేదికను ఎందుకు కూల్చారో అర్ధమయ్యిందో లేదో !!
కరకట్ట కొంప కొల్లేరు అయ్యాక అయినా బాబుకు బుద్ధి వచ్చిందో లేదో!!!

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top