జ‌పాన్ లో చంద్ర‌బాబు

చంద్ర‌బాబు బృందం జ‌పాన్‌కి వెళ్ళింది. ఆ దేశ‌పు ప్ర‌తినిధుల‌తో బాబు స‌మావేశ‌మ‌య్యారు.
  `` మేము ఇక్క‌డ‌కు ఎందుకొచ్చామంటే మా రాష్ట్రంలో మీతో పెట్టుబ‌డులు పెట్టించ‌డానికి...  సంవ‌త్స‌రం నుంచి నేను ఇలాగే దేశాలు ప‌ట్టుకు తిరుగుతున్నాను. మా పార్టీ పేరు తెలుగుదేశం అందువ‌ల్ల నేను తెలుగు జ‌నం డ‌బ్బుతో దేశాలు తిరుగుతూ రాజ‌ధానిని నిర్మించ‌డానికి ప్లాన్ వేస్తున్నాను.రాజ‌ధాని ఎక్క‌డో తేల్చ‌డానికి ఏడాది ప‌ట్టింది. ఇటుక‌లు వేయ‌డానికి ఇంకో రెండేళ్ళు, గోడ‌లు లేప‌డానికి ఇంకో రెండేళ్ళు, ఆ త‌రువాత జ‌నం ఎలాగూ న‌న్ను దింపేస్తారు. రాజ‌ధాని నిర్మాణం వేగ‌వంతం చేయాల‌ని అప్పుడు మా పార్టీ ఉద్య‌మిస్తుంది`` అన్నాడు బాబు
      జ‌పాన్ ప్ర‌తినిధుల‌కు ఏం అర్థంకాక ఇంగ్లీష్‌లో మాట్లాడ‌మ‌న్నారు.
   `` మా వాళ్ళు భ్రీఫ్డ్ మీ.............`` అంటూ ఏదో మొద‌లెట్టాడు బాబు తెలుగుకంటే ఇంగ్లీష్ డేంజ‌ర‌ని, మ‌ళ్ళీ తెలుగులో మాట్లాడ‌మ‌న్నారు.
  `` తెలుగంటే త‌క్కువేం కాదు.......ఇటాలియ‌న్ ఆఫ్ ది ఈస్ట్‌, కానీ మేము దాన్ని వ‌రెస్టు గా  మార్చాం. ఎందుకంటే మా వ‌ర్ణ‌మాల వేరు. అ అంటే అవినీతి, ఆ అంటే ఆశ్రిత ప‌క్ష‌పాతం, ఇ అంటే ఇచ్చిపుచ్చుకోవ‌డం, ఈ అంటే ఈక‌లు అంటే కోడిని మ‌నం తిని జ‌నానికి ఈక‌లు ఇవ్వ‌డ‌మే ప్ర‌జాస్వామ్యం`` అన్నాడు బాబు
   జ‌పాన్ వాళ్ళు బుర్ర‌గోక్కొని `` చ‌క‌షికె, మ‌క‌తుకె`` అని వాళ్ళ భాష‌లో  అన్నారు.
  `` ఏ ప‌న‌యినా చ‌క‌చ‌కా చేయాల‌నే నా కోరిక‌. అందుకే తొంద‌ర‌గా ఎమ్మెల్యేల‌ను కొనాల‌నుకున్నాను. కొనేవాడికి తెలివున్న‌పుడు అమ్మేవారికి కూడా తెలివుంటుంద‌ని తెలుసుకోలేక పోయాను. క‌లుగులో ఎలుక‌లా అయ్యింది పొజిష‌న్ అన్నాడు బాబు
  త‌లాతోకా లేకుండా మాట్లాడుతున్న బాబు మాట‌ల‌కి జ‌డుసుకుని `` అస‌లు మీ రాష్ట్రంలో మేమెందుకు పెట్టుబ‌డులు పెట్టాలో చెప్పండి`` అని అడిగారు.
`` ఎందుకంటే అమ‌రావ‌తి ఒక‌ప్పుడు బౌద్ధ‌క్షేత్రం. అక్క‌డ స్థూపాలున్నాయి. ఆరామాలున్నాయి. ప‌క్క‌న కృష్ణ‌న‌ది వుంది. విజ‌య‌వాడ‌కు ద‌గ్గ‌ర తిరుప‌తికి దూరం గ‌న్న‌వ‌రంలో ఎయిర్‌పోర్టుంది, గుంటూరులో రైల్వేస్టేష‌నుంది...........``అన్నాడు బాబు.
`` ఏ ప్ర‌శ్న‌కూ సూటిగా స‌మాధానం చెప్ప‌రు క‌దా.......``
`` జ‌పాన్‌లో బౌద్ధ‌మ‌తం వుంది కాబ‌ట్టి, మీరు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెడితే తీరానికి తీరం ప్ర‌సాదానికి ప్ర‌సాదం``
మా నెత్తిన శ‌ఠ‌గోపం అని తెలుగు తెలిసిన జ‌పాన్ ప్ర‌తినిథి అన్నాడు. మీ నెత్తిన కాదు, మా మామ నెత్తిన కూడా శ‌ఠ‌గోపం పెట్టాను. మాకు రెండు రెళ్ళు నాలుగంటే  తెలియక‌పోయినా, కోటిలో టెన్ ప‌ర్సెంట్ ఎంతో తెలుసు. అందువ‌ల్ల ముందు ప‌ర్సెంటేజీ మాట్లాడుకుని త‌రువాత పెట్టుబ‌డు గురించి చ‌ర్చించుకుందాం అన్నాడు బాబు.
మా ద‌గ్గ‌ర ఉత్ప‌త్తే త‌ప్ప మీలాగా ఉత్ప‌త్తి వుండ‌దు. అని జపాన్  వాళ్ళు నాలుగైదు న‌గ‌రాలు చూపించి తిరుగు విమాన‌మెక్కించారు.
రాష్ట్రానికి తిరిగి వ‌చ్చిన చంద్ర‌బాబు ప్రెస్‌మీట్ పెట్టి జ‌పాన్ వాళ్ళ పెట్టుబ‌డుల‌తో రాజ‌ధానిని మ‌రో టోక్యోగా నిర్మిస్తాన‌ని ఎప్ప‌టిలాగే కంబాలు ప‌లికాడు. దాన్ని ప‌చ్చ మీడియా పెద్ద పెద్ద హెడ్డింగుల‌తో మొద‌టి పేజీలో ప్ర‌చురించి మురిసిపోయింది.
-- రాహుల్‌
Back to Top