గ‌జినీ బాబు

చంద్రబాబుకు సుద్దులు చెప్పే పెద్దలు ఎవరు లేకుండా పోయారు. అందుకే ఎలా మాట్లాడినా చెల్లి పోతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలా పడితే అలా మాట్లాడకూడదని ఈ నలభై ఏళ్ల అనుభవజ్ఞుడు కి చెప్పే వాళ్ళు ఎవరు? చెప్పిన వినే రకం కాదని పార్టీలోని బాబు కంటే సీనియర్లకు తెలియదా ఏంటి. అయినా రాజకీయాల్లో దారి చూపించడానికి మెంటర్స్ ఉండరు. కనీస స్థాయి నాయకుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. ఏదైనా వ్యాఖ్యానించాలి అంటే ముందు వెనకా చూసుకుంటాడు. కానీ చంద్రబాబుకు అల్జీమర్స్ లాంటిది ఏదైనా ఉందేమో తెలీదు కానీ వెనకటి విషయాలు గుర్తుపెట్టుకుని మాట్లాడటం బాబు హిస్టరీలోనే లేదు. 
ప్రతిపక్షం గురించి విమర్శించేటప్పుడు అవన్నీ వారి కంటే తన పార్టీకి, తనకి ఎక్కువ దగ్గరగా ఉన్నాయని గ్రహించటం లేదు. జగన్ను విమర్శించాలన్నా తొందరలో చంద్రబాబు ఇలాంటి విషయాలు అన్ని మరచి పోతుంటారు. ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్ హైదరాబాద్‌లో విలాసంగా కూర్చుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అని కారాలు మిరియాలు నూరుతున్నాడు చంద్రబాబు. హైదరాబాద్ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు అని మరో వ్యాఖ్య చేశాడు.  టికెట్లకు డబ్బు సంచీలే కొలమానం అని కళ్ళెర్ర చేస్తున్నాడు. 
ఇదే చంద్రబాబు విభజన తర్వాత హైదరాబాదులో లంకంత కొంప కట్టుకున్నాడు. కుటుంబాన్ని అక్కడే పెట్టుకున్నాడు. ఓటుకు నోటు కేసులో దొరికిపోబట్టి కానీ లేకపోతే చంద్ర బాబు కుటుంబంతో సహా హైదరాబాద్లోనే తిష్ట వేసి ఉండేవాడు. అభ్యర్థుల ఎంపిక ఎక్కడ నుండి జరిగిన, ప్రజలు నేతనే అభ్యర్థిగా వైయ‌స్ జగన్ ఎంపిక చేస్తున్నారని బాబుకి అస్సలు తెలీదు. ఎందుకంటే విచ్చలవిడిగా ఒక్క సీటు కోసం నంద్యాలలో కోట్లు కుమ్మరించిన నేతలు బాబు వైపు వున్నారు. డబ్బు సంచులు కొలమానం అయిన అభ్యర్థులే ఉంటే ఈపాటికే జగన్ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండేవారు. ఒక ఎమ్మెల్సీ గెలిపించుకోవడం కోసం ఎమ్మెల్యేలకు కోట్లకు కోట్లు లంచం ఇవ్వడానికి సూట్కేసులను, డబ్బు సంచులను మోసికెళ్ళిన వాళ్ళ కథలు రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి తెలుసు.  బాబు డబ్బు మూటలు పేరు ఎత్తితే ఎవరికైనా ఓటుకు కోట్లు సంఘటనే గుర్తొస్తుంది.  హైదరాబాద్ లో జగన్ నివాసం అనబోతే కరకట్టకు బాబు పారిపోయిన సంగతి గుర్తొస్తుంది. ఎవరు తవ్విన గోతిలో వారే పడ్డట్టు, బాబు చేసిన వ్యాఖ్యలు బాబుకే భూమరాంగ్ లా వచ్చి తగులుతున్నాయి. జగన్ ను వేలెత్తి చూపేబోతే 100 వేళ్ళు అతడినే దోషిగా చూపుతున్నాయి.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top