కూలీనెంబర్ '0 '

చంద్రబాబు ఆక్రోశం ఆవేదన చూస్తే అయ్యోపాపం అని కాదు, అయ్యా ఏమిటీ శాపం అని జనాలు ఛీదరించుకునేలా ఉంది. చచ్చేంత పని చేస్తున్నాను, చచ్చినట్టు ఓట్లు నాకే వేయండి అని అడుగుతున్నారు. నిన్నటి దాకా నేను అద్భుతాలు చేసాను, చరిత్రలు సృష్టించాను, జిడిపిని జుట్టు పట్టుకుని లాగి మరీ పెంచాను. అభివృద్ధి అంతరిక్షానికి చేర్చాను అని చెప్పుకున్న బాబు ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించాడు. ప్రజలకు నేనేంటో తెలుసు, నాకే ఓటేస్తారు, అందుకు నంద్యాలే సాక్ష్యం అంటూ నానా రకాలుగా ప్రగల్బాలు పలికిన నారా నోరు ఇప్పుడు ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకుంది. తనకు ఓటు వేయని వారిదే పాపం అని, తన కష్టానికి ప్రజలు ఓట్ల రూపంలో ప్రతిఫలం చెల్లించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాబుగారి మాటలకు సామాన్యుల రియాక్షన్ ఇదిగో ఇలాగే ఉంటోంది. 

నాకు ఓట్లేయకపోతే ప్రజలే సిగ్గుపడాలి

చంద్రబాబుకు ఓటేయక తప్పుచేసామే అని ప్రజలే సిగ్గుపడాలట. ఒక విషయం ఆయనకింకా అర్థం కాలేదు. ప్రజలు ఆల్రెడీ సిగ్గు పడుతున్నారు...గత ఎన్నికల్లో చంద్రబాబును ఓటేసి గెలిపించినందుకు. వ్యవసాయాన్ని పండుగ చేస్తా అని చంద్రబాబు చెబితే పులి పులిహోర తింటుందని నమ్మినట్టు బాబును నమ్మినందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు. షరతులు లేని రుణమాఫీ అంటే బేషరతుగా ఓట్లేసినందుకు సిగ్గుపడుతున్నారు. ఆయనొస్తాడు ఉద్ధరిస్తాడు అని నమ్మినందుకు యువత అంతా సిగ్గుపడుతున్నారు. దేశ విదేశాల్లో బాబుగారి విన్యాసాలు, ఒక్క కంపెనీనైనా రాష్ట్రానికి రప్పించలేని అసమర్థత చూసి నేతలంతా సిగ్గుపడుతున్నారు. బాబు పరిపాలనలో రాష్ట్రాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసినందుకు ప్రజలంతా సిగ్గుపడుతున్నారు. 

తాను చేసిన పనులకు అన్ని ప్రాంతాల వారూ బాబుగారికి ఓటేసేయాలట

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేనందుకు బాబుకు ఖచ్చితంగా ఓటేయాల్సిందే. ఆయన కొడుకుకు మాత్రం మంత్రి పదవి పోస్టింగు ఇప్పించుకుని, లక్షల మంది నిరుద్యోగులను గాలికొదిలేసినందుకు ఆయనకే ఓటేయాలి. ప్రజల సొమ్ముతో ప్రపచంమంతా చుట్టొస్తున్నందుకు ఆయనకు కాక ఇంకవరికి ఓటేయాలి...? బంగారం పండే రైతుల భూములను బంజర చేసి, విదేశీ కంపెనీలకు కారు చౌకగా కట్టబెడుతున్నందుకు బాబుకి ఓటేసి ఒళ్లో కూర్చోబెట్టుకోవాలి. ప్రపంచ స్థాయి నగరం అంటూ కబుర్లు చెప్పి బాహుబలి గ్రాఫిక్స్ చూపించినందుకు చంద్రబాబుకే ఓటేయాలి. ప్రతి జిల్లాకూ ఓ స్మార్ట్ సిటీ ప్రకటించి పత్తా లేకుండా పోయినందుకు ఖచ్చితంగా బాబుకే ఓటేయాలి. భూములు కబ్జాలు చేసి, కమీషన్ల దందాలు చేసి, బెల్టు షాపులకు దారులు వేసి, అవినీతికి అడ్డా చేసినందుకు చంద్రబాబుకు ఓటేసే తీరాలి. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని స్టేలు తెచ్చుకుంటున్నందుకు చంద్రబాబుకు ఓటేసి గెలిపించాలి. 

అన్నీ చేసాక కూడా నాకెందుకు ఓట్లేయరు..మీకింకా ఏం కావాలి 

అవును అన్నీ చేసారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో చేయనిదంటూ లేదు. అవినీతికి ఎన్ని దారులున్నాయో అన్నిటినీ వాడేసారు. రాష్ట్రన్ని అందినకాడికి దోచేసారు. అనుయాయులకు కావాల్సినంత ఫేవర్ చేసేసారు. కుటుంబ సభ్యులకు కోటాలో సీట్లు ఇచ్చేసారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులను కావాల్సిన వారికి కట్టబెట్టేశారు. ఆంధ్రరాష్రాన్ని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసారు. ఓటుకు నోటు వ్యవహారం నడిపించారు. ఇంకా ఏం చేయాలంటారు..ప్రజలు ఇంకా ఏం కావాలంటారు...?

కష్టానికి కూలీ చెల్లించాలి

ఆయన కష్టపడ్డం కాదు, రాష్ట్రాన్ని నష్టపరిచాడు. ఆయనకు ప్రజలు కూలీ ఇవ్వడం కాదు, నష్టపరిహారం ఆయనే ప్రజలకు ఎదురు చెల్లించాలి. పని చేసి కూలీ అడిగితే అది ధర్మం, దోచుకుని దబాయిస్తే అది చంద్రబాబు తత్వం. 
Back to Top