కాంగ్రెస్ కు పట్టిన చంద్ర గ్రహణం


జాతీయ కాంగ్రెస్ కు గ్రహణం పట్టింది. ఎప్పుడైతే చంద్రబాబుతో చేయి కలిపిందో అప్పుడే ఆ పార్టీకి అపశకునాలు మొదలయ్యాయి. మామూలుగానే మహా చారిత్రక పార్టీలో సీట్ల కోసం ఎదురు చూసే ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువ. ఇక చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని 14 స్థానాలు సమర్పించుకున్ర కాంగ్రెస్, అభ్యర్థుల ఎంపికలోనూ తన చేతిని బాబు చేతిలో వేసేసింది. అమరావతి దిల్లీల మధ్య చక్కర్లు కొడుతోందీ ఎంపిక లిస్టు. ఓ పక్క తెలంగాణా టిడిపి కార్యాలయంలో, ఇటు కాంగ్రెస్ అధికారిక కార్యలయంలో తిరుగుబాటు బావుటాలు, అసంతృప్తుల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు నిండా నెల్లాళ్లు లేవు. సీట్ల పంపాకాలు అయినా అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామైపోయింది. రాహుల్ కి ఇది తలకు మించిన భారం అయిపోయింది. ఏ మూహూర్తంలో బాబుతో చేయికలిపానా అని ఆలోచిస్తున్నాడు. ఓ పక్క నామినేషన్ల పర్వం మొదలైపోయినా కాంగ్రెస్ లో అభ్యర్థులు ఖరారు కాలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు మాత్రం ఖరాబు అయిపోయింది. ఓపక్క కాంగ్రెస్ పార్టీ  పొత్తుల విషయంలో క్లారిటీ లేక సతమతమౌతుంటే, మరోపక్క పోటీదారు టిఆర్ఎస్ బిఫారాలు పంచేసుకుని ప్రచారంలో దూసుకుపోతోంది. తెలంగాణాలో పట్టుబట్టి 14 స్థానాలు పుచ్చుకున్న బాబు యకాయకిన 11 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేసాడు. మరో మూడు స్థానాలకు ఇప్పుడో అప్పుడో అన్నట్టు కేండేట్లు రెడీగా ఉన్నార్ట. ఇదంతా చూసిన రాహుల్ గాంధీకి అరికాలిమంట అరచేతిలోకెక్కింది. ఆల్రెడీ పొత్తులతో ఉన్న గుత్తిలో చేరి, అసలా పొత్తులకి కారణం నేనే అంటూ ప్రచారం చేసుకోడమే కాక, ఇప్పుడీ గలాటా తమాషాలకు కూడా బాబు ఐరెన్ లెగ్గే కారణం అని రాహుల్ కు కాంగ్రెస్ కురువృద్ధులు కఠిన వాస్తవం చెప్పారు. పెట్టుకున్న పొత్తు కాదనలేక, చేతికంటిన చమురు విదుల్చుకోలేక యమయాతన పడుతున్నాడట రాహుల్. 
 
Back to Top