చంద్ర‌యాన్ టు సూర్య‌యాన్ 

**చంద్ర‌యాన్ గురించి ప్ర‌పంచం అంతా మాట్లాడుకుంటోంది. చంద్ర‌యాన్ గురించి మాట్లాడ‌టం అంటే నా గురించి మాట్లాడుకున్న‌ట్టే. ఎందుకంటే టెక్నాల‌జీని క‌నిపెట్టిందే నేను. సెల్ పోన్ కి ఆద్యుడిని నేను. కంప్యూట‌ర్ ను క‌ని పెంచింది నేను. ఐటీకి పితామ‌హుడిని నేను. టెక్నాల‌జీతో తుఫాన్లు ఆపేది నేను. క‌నుక‌నే ఈ ప్రాజెక్టుకు నాపేరు పెట్టారు. నా న‌ల‌భై ఏళ్ల అనుభ‌వంలో ఇలాంటి టెక్నాల‌జీల‌ను బోలెడు తెచ్చాను. బిల్ గేట్స్ కు కూడా స‌ల‌హాలిచ్చాను అంటూ స‌ద‌స్సులో త‌న స్పీచ్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడు చంద్రోబు. 

మీ స్పీచ్ విని స‌ద‌స్సుకు వ‌చ్చిన అమెరికా, చైనా, కొరియా, కంబోడియా ప్ర‌తినిధులంతా ఒక్క‌దెబ్బ‌కు మూర్చ‌పోతారు గ‌దా నాన్నారూ ముద్దు ముద్దుగా అడిగాడు చంద్రోబు గారాల పుత్రుడు లీకేష్. 

భావి రాజ‌కీయ రాజ *అనీతిజ్ఞుడి*గా కొడుకును తీర్చిదిద్దాల‌ని చంద్రోబు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. కానీ అదేం ఖ‌ర్మ‌మో! ఆంధ్రాని అర‌క్ష‌ణంలో 6వేల కోట్ల‌కు తాక‌ట్టు పెట్టేయ‌గ‌ల తెలివిగ‌ల చంద్రోబుకు 175 నియోజక వ‌ర్గాల్లో 200 సీట్లు గెలుస్తా అనే కొడుకు లీకేష్ పుట్టాడు. పంతుళ్లు లీకేష్‌కు పాఠాలు చెప్పి పిచ్చెక్కి పారిపోయారు. వార‌సుడు క‌దా అని రాజ‌కీయాల్లో దింపి చంద్రోబు నిండా మునిగిపోయాడు. 

నా స్పీచ్ కు వాళ్లు మూర్ఛ‌పోతారో లేదోగానీ నువ్వు మాత్రం మైకు ముందుకు రాకు. నీ త‌ల‌తిక్క‌తో నాకున్న ఆ కాస్త ప‌ర‌ప‌తికీ పంగ‌నామం పెట్టేయ‌కు విసుక్కున్నాడు చంద్రోబు.

అదేంటి నాన్నారూ మీ త‌ర్వాత స్పీచ్ ఇద్దామ‌ని నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యాను అన్నాడు లీకేష్.

ఏమ‌ని స్పీచ్ ఇద్దామ‌నుకున్నావ్..ఓ సారి నా ముందు చెప్పు అనుమానంగా అడిగాడు చంద్రోబు.

త‌మ్ముళ్లూ ..... నేను చెబుతున్నా వినండి....మ‌న నాయ‌కుడు చంద్రోబు గారు చంద్ర‌యాన్ లో చంద్రుడి మీద‌కు వెళ్లి అక్క‌డ 100 హైద‌రాబాద్ లు క‌డ‌తారు. అక్కడ నుంచి సూర్య‌యాన్ లో సూర్యుడి మీద‌కు వెళ్లి మ‌రో 100 అమ‌రావ‌తులు నిర్మిస్తారు. ఆయ‌న విజ‌న్ అన్ని గ్ర‌హాల మీదా ప‌ని చేస్తుంది...భూమ్మీద మ‌న‌కు ప‌ట్టిన ద‌శే.... అన్ని గ్ర‌హాల‌కూ ప‌డుతుంది. మ‌న చంద్రోబు గ్ర‌హ‌ణం న‌వ‌గ్ర‌హాల‌నూ ప‌డ‌గొడుతుంది.......

లీకేష్ స్పీచ్ వింటూ చంద్రోబు చంద్ర‌మండ‌లంలోకి ప్ర‌యాణం క‌ట్టేసాడు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top