తమ్ముళ్ళ‌కు బాబు పాఠాలు

చంద్ర‌బాబు త‌మ్ముళ్ళ‌కు ఎబిసిడిలు కొత్త‌గా నేర్పించాడు
  • A-Acting-రాజ‌కీయాల్లో ఎంత బాగా న‌టిస్తే అంత డెవ‌ల‌ప్‌మెంట్‌
  • B-Backstab-వెన్నుపోటు పోడ‌వ‌డం న‌న్ను చూసి నేర్చుకోండి
  • C-Corruption-క‌రప్ష‌న్ అనేది మ‌న జీవ‌న విధానం. ఇప్పుడు దీంతోనే దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకొన్నాం.
  • D-Deceive-న‌మ్మిన వారిని మోసం చేయ‌డ‌మే మ‌న టైప్ పాలిటిక్స్‌
  • E-Eating-రాజ‌కీయాల్లో తిన‌డం ముఖ్యం
  • F-Fox-అన్నింటిలోనూ న‌క్క మ‌న‌కు ఆద‌ర్శం
  • G-Gobels-గోబెల్స్ ప్ర‌చారంలో మ‌న‌కు మ‌న‌మే సాటిగా ఉండాలి
  • H-Hat-మాట‌ల‌తో టోపీ పెట్టాలి
  • I-Iam-నేను అనే భావ‌న ముఖ్యం.ఎదుటివాడు మునిగి పోయినా నేను బాగు ప‌డాలి
  • J-Jump-రాజ‌కీయాల్లో అవ‌స‌రాన్ని బ‌ట్టి జంపింగ్ చేస్తుండాలి
  • K-Kickback-ముడుపులివ్వాలి,తీసుకోవాలి
  • L-Lie-అబ‌ద్దాలు చెబుతూనే ఉండాలి,ఆపితే మ‌న‌త‌ల వెయ్యి వ‌క్క‌ల‌వుతుంది
  • M-Magic-తిమ్మిని బొమ్మి,బొమ్మిని తిమ్మి చేసే మ్యాజిక్ సాధ‌న చేయాలి
  • N-NTR-అవ‌స‌ర‌మైన‌పుడు ఎన్టీఆర్ పేరును స్మ‌రించాలి,అవ‌స‌రం తీరాక చెత్త‌బుట్ట‌లో వేయాలి(ఇది జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి కూడా వ‌ర్తిస్తుంది)
  • O-Opinion-నిరంత‌రం ఒపీనియ‌న్స్ మారుస్తూండాలి అప్పుడే నిజ‌మైన పొలిటీషియ‌న్ల‌గా మారుతాం
  • P-People-ప్ర‌జ‌లు,ప్ర‌జ‌లు అంటూ ఉండాలి,అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారి వాళ్ళ‌కి సున్నం కొట్టాలి
  • Q-Qualification-మ‌న‌కి ఏ యోగ్య‌త లేక‌పోయినా అనుక్ష‌ణం ఎదుటి వాళ్ళ యోగ్య‌త‌ని ప్ర‌శ్నిస్తూవుండాలి
  • R-Rate-అంద‌రికి ధ‌ర‌లు నిర్ణ‌యించి అవ‌స‌ర‌మైన‌పుడు కొనాలి
  • S-Strategy-ఎదుటి వాళ్ళ‌ని ముంచ‌డానికి వ్యూహం ప‌న్నాలి.అదే స‌మ‌యంలో మ‌నం మున‌గ‌కుండా చూసుకోవాలి
  • T-Truth-స‌త్యం మ‌న‌కు జీవిత కాల‌పు శ‌త్రువు,నిజాన్ని మ‌న ద‌రిదాపుల‌కి కూడా రానివ్వ‌కూడ‌దు
  • U-Use-మ‌నుషుల్ని ఉప‌యోగించుకొని త‌రువాత విసిరి పారేయాలి
  • V-Values-ఎల్ల‌ప్పుడూ విలువ‌ల గురించే మాట్లాడు అయితే ఎప్పుడూ ఆచ‌రించ‌కు
  • W-Win-ఎలాగైనా గెల‌వాలి కింద‌ప‌డినా మ‌న‌మే గెలిచామ‌ని వాధించాలి
  • X-Xray-ఎక్స్‌రేక‌ళ్ళు అవ‌స‌రం మ‌నం వెన్నుపోటు పొడ‌వ‌క త‌ప్ప‌దు,కాబ‌ట్టి,మ‌న‌ల్ని ఎవ‌డూ వెన్నుపోటు పొడ‌వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి
  • Y-Yes-అన్నింటికి ఎస్ అనాలి,ఏ ప‌ని చేయ‌కుండా వుండాలి
  • Z-Zigzag-స‌ర‌ళ‌రేఖ‌ల్ని కూడా జిగ్‌జాగ్ చేసి అంద‌రికి తిక‌మ‌క పుట్టించాలి.
-రాహుల్‌
Back to Top