బాబుకు కేసీఆర్ బహుమతి


కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్  కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నాడో లేదో కానీ ఎపి ప్రజలు మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లాంటిదే ఇది కూడానా అని గెస్  చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలే కాదు ఎపిలోని ఎందరో ప్రముఖులు కూడా త్వరగా ఆ గిఫ్టేదో ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. 
బాబుకు కేసీఆర్ ఇవ్వబోతున్న ఆ రిటన్ గిఫ్ట్ ఏమై ఉంటుంది. తెలంగాణాలో చంద్రబాబు చారిత్రక ఓటమిని గిఫ్ట్ పాక్ చేసి ఎపిదాకా పట్టుకుపొమ్మని ఇవ్వబోతున్నాడా అని కొందరు అనుకుంటున్నారు. లేదు బాబు గారి ఆడియో టేపుకు మోక్షం కలిగించడమే ఈసారి ఇవ్వబోతున్న బహుమతి అని మరికొందరి అంచనా. సిబిఐని ఎపిలో చంద్రబాబు బాన్ చేసాడు కనుక సిబిఎన్ ని తెలంగాణాలో బాన్ చేయడం కేసీఆర్ తెలుగు ప్రజలకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అంటున్నారు మరికొందరు. 
ఓటుకు నోటు కేసుకు జీవం పోసి బాబు రాజకీయ చరిత్రకు పులిస్టాప్ పెట్టి, జైల్లో విశ్రాంతి కల్పించడమే కేసీఆర్ బాబుకు ఇవ్వబోతున్న అద్భుతమైన రిటన్ గిఫ్ట్ అంటున్నారు తెలంగాణా తమ్ముళ్లు. పనిలో పనిగా రేవంత్ రెడ్డిని కూడా బాబుకు తోడు పంపించే అవకాశం లేకపోలేదన్నిది ఇంకొందరి థింకింగ్. 
మొత్తానికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కేసీఆర్ రిటన్ గిఫ్ట్ కోసం అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ రిటన్ గిఫ్ట్ ఏమిటా అని చంద్రబాబు కూడా భయం భయంగా ఎదురు చూస్తున్నాడన్న విషయం జ్ఞాన భేరిలో చంద్రబాబు మాటలను బట్టే అర్థం అవుతోంది. ’’కేసీఆర్ నాకేం గిఫ్ట్ ఇస్తారో చూస్తా’’ అంటూ చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా...నిజమేమిటో అందరికీ అర్థం అవుతూనే ఉంది. బాబు గుండెల్లో మోగుతున్న కేసీఆర్ భేరీల అదురు ఎంత దాచుకోవాలనుకున్నా కనిపిస్తూనే ఉంది. 
 

తాజా వీడియోలు

Back to Top