అందరూ వినండహో..!

అధికారుల సమావేశం చంద్రబాబు మైక్ తీసుకున్నాడు
    అధికారులకి  నేను చెప్పేదేమంటే అందరూ నిజాయితీగా పనిచేయాలి తెలుగుదేశమంటే నిప్పు అన్నాడు బాబు
     కూరలో ఉప్పు, ఇనుముకి పట్టిన తుప్పు అని గొణిగాడో అధికారి
 
  మీరు గొణిగినా, సణిగినా నేను చెప్పేది చెపుతూనే వుంటా. నిజాయితీగా
పనిచేయడమంటే అనేక అర్థాలున్నాయి. ప్రభుత్వం ఎలా పనిచేసినా చూస్తూ వుండడమే
నిజాయితీ ఎన్నికలంటే మీకు తెలియందికాదు. కోట్లు ఖర్చు పెట్టాలి. అవన్నీ
రాబట్టుకోవాలంటే మా ఎమ్మెల్యేలు ఇసుక వ్యాపారాలు, అన్ని రకాల దందాలు
చేసుకోవాలి. నిజాయితీ అని అరిస్తే నిజాయితీగా వుండమని కాదు, సమయాన్ని బట్టి
ఏది నిజాయితీ ఏదికాదో నిర్ణయించుకోవాలి అన్నాడు బాబు
     మా మీద మీ పార్టీ వాళ్ళు దాడులు కూడా చేస్తున్నారు సార్ చెప్పాడో అధికారి.
 పుట్టలో
వేలు పెడితే  చీమయినా కుడుతుంది. ఎమ్మెల్యేలు కొట్టరా. అయినా అధికారంలో
వున్నపుడు కాకపోతే ప్రతిపక్షంలో వున్నపుడు ఎవరైనా దాడులు చేస్తారా? మా
పార్టీ వాళ్ళు పేదవాళ్ళు భూములు ఆక్రమించుకుంటారు. మీరు పేదల తరుపున
మాట్లాడండి, కానీ చేతలు మాత్రం మా వైపే వుండాలి కాదు కూడదంటే బదిలీ అన్నాడు
బాబు.
       సార్ నిప్పులాంటి మీ ప్రభుత్వంలో మేమేం చేయాలి? అడిగాడో పోలీసు అధికారి
     మీరేం చేసినా మాకేం ఇబ్బంది లేదు, ప్రభుత్వంపై ఈగ వాల కూడదు
    దోమవాలితే*
    ప్రభుత్వమే ఒక దోమ, ప్రజల్ని కుడుతుంది మస్కిటో రీ ఫిల్లర్లు వాడినా ఉపయోగంలేదు అందువల్ల దోమపై దోమ వాలినా ఏమీ కాదు
   అధికారుల విధుల గురించి చెప్పండి సార్
  
మా పార్టీ ఏం చేసినా కళ్ళుమూసుకుని కూర్చోవడం మీ ప్రాధమిక విధి. మా
నాయకులు స్టేషన్కొచ్చి పంచాయితీ చేస్తారు. రెవిన్యూ రికార్డులు తారుమారు
చేస్తారు. మా కార్యకర్తలు భూములు ఆక్రమిస్తారు. ఇసుక ఖాళీ  చేస్తారు.
ఒక్కోసారి మిమ్మల్ని తంతారు. అస‌లు త‌న్నేవాడెవడు, తన్నించేవాడెవడు అని
భగవద్గీతని గుర్తుచేసుకుని మీ ప‌నులు మీరు చేసుకోవాలి
     మా యూనియన్లు, సంఘాలు ఏం చేయాలి?
 
  అప్పుడప్పుడు అరవాలి. కానీ గట్టిగా అరవకుడదు, మధ్యలో మీడియా వాళ్ళు
వచ్చి కెవ్వుకేక అంటారు. అదో వినోదం అనుకోవాలి. కొట్టినా తిట్టినా
పడివుంటడమే ఉద్యోగ ధర్మం అయినా మీ పిచ్చిగాకపోతే గద్దెనెక్కింది మేం బాగు
పడ్డానికే గానీ ప్రజల్ని బాగుచేయడానికా?
   సమావేశం ముగిసింది
   ఏంటిసార్ విశేషాలు అని ఓ అధికారిని విలేకరి అడిగాడు
  నిప్పులా పనిచేసిన ప్రతివాడు కాలిపోతాడని బాబు చెప్పాడు అన్నాడు అధికారి
 -రాహుల్
Back to Top