బ‌డుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుప‌డిన మ‌హనీయుడు ఫూలే 

విజ‌య‌న‌గ‌రం: బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి పాడుప‌డిన మ‌హ‌నీయుడు జ్యోతిరావుఫూలే అని జెడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి పట్టణంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి  జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , పార్లమెంట్ సభ్యులు  బెల్లాన చంద్రశేఖర్, త‌దిత‌రులు పూల‌మాల వేసి నివాలుల‌ర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్  చైర్మ‌న్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) మాట్లాడుతూ.. సుమారు 200 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకే పాటుపడిన మహనీయుడు జ్యోతిబా పూలే ..ఆయ‌న‌ సతీమణి సావిత్రిబాయి పూలే  సమాజంలో మహిళలు కూడా సముచిత స్థానాన్ని పొందాలని ఆశయంతో ప్రతి మహిళ చదువుకోవాలని ఆ రోజుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలో ఏర్పాటు చేసి సమాజంలో బడుగు బలహీన, మహిళల అభ్యున్నతికి ఆ  దంపతులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.  

Back to Top