విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు విశాఖపట్నంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో మేడే వేడుకలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశాఖ నగర్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు , జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు , ఎమ్మెల్యే నాగిరెడ్డి , ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
వానప్రస్థ వృద్ధాశ్రమంలో అన్నదానం
విశాఖ,అనకాపల్లి,విజయనగరం జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్,టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు పరిథిలో పట్టాభిరెడ్డి తోట వద్దనున్న వానప్రస్థ వృద్ధాశ్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకట రమణ, 48వార్డు ఇంచార్జ్ నీలి రవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
