కరోనా వైరస్‌ నాశనార్ధం ధన్వంతరి యాగం

కరోనా మహమ్మారిపై తప్పక విజయం సాధిస్తాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: కరోనా వైరస్‌ నియంత్రణకు టీటీడీ ఆధ్వర్యంలో ధన్వంతరి యాగం నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఏడు లోకాలకు ప్రతినిధులైన ఏడు హోమ గుండాలను ఏర్పాటు చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ హోమం నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు..
 ఎక్కడున్నవారు అక్కడే ఉండి వైరస్‌ వ్యాప్తి నివారణకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఊర్లో ఉన్నవారు ఆ ఊర్లోనే ఉండాలి. ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. అందరం కూడా ఈ నిబంధనలు పాటిద్దాం. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి దయతో కరోనా మహమ్మారిపై తప్పకుండా విజయం సాధిస్తాం. యావత్తు ప్రపంచంలో విస్తరించిన కరోనా మహమ్మారి నియంత్రణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే మహా సంకల్పంతో శ్రీశ్రీనివాస ఉత్సవ సహిత ధన్వంతరీ యాగం ధర్మగిరి పాఠశాల ఆవరణలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నాం. ఏడు లోకాలకు ప్రతినిధులైన ఏడు హోమ గుండాలు నిర్మించి శ్రీ మహా విష్ణువుని ప్రార్థిస్తూ వేదమంత్రోచ్చరల మధ్య హోమం నిర్వహిస్తున్నాం. ఆరోగ్యప్రదాత అయిన ధన్వంతరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ సర్వమంగళములు కాంకిస్తూ ధన్వంతరి యాగం నిర్వహిస్తున్నాం. శాంతి మంత్రాలు, విష్ణు మహాలక్ష్మీ మంతనాలు, ధన్వంతరి మహా మంత్రం ఇందులో ప్రధానంగా ఉంటాయి. శాంతి కలశం, ధన్వంతరి కలశ స్థాపన చేసి, ఆ కలశ జపాన్ని మంతరించి ఆకాశంలోకి పరోక్షణ చేస్తారు. ఆ మంత్ర జల ప్రభావంతో ప్రకృతి శాంతించి సర్వ శుభములు కలిగి అయురారోగ్యాలతో భయప్రమాదాల దుర్భిక్ష , అశుభ నివారణ జరుగుతుంది. తప్పకుండా కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ యాగం పూర్తి అయ్యేలోపే ఈ కరోనా వ్యాధి నాశనానికి చర్యలు చేపట్టే కార్యక్రమం జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top