ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు

ఢిల్లీ: ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ కార్యాల‌యంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా ర‌ఘునాథ్‌రెడ్డిలతో ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ ప్ర‌మాణం చేయించారు. రాజ్యసభలో ప్ర‌స్తుతం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Back to Top