విగ్ర‌హాల ధ్వంసంపై సీబీఐ విచార‌ణ చేయాల‌ని సీఎంకు విన‌తి

సీఎం వైయ‌స్ జగన్‌కు మంచి పేరు రావద్దని టీడీపీ కుట్ర‌లు 

టీటీడీ  చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

 తాడేపల్లి: విగ్రహాల ధ్వంసం వరుస ఘటనల వెనక టీడీపీ వారే ఉన్నారనేది వాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బీజేపీ కూడా టీడీపీ ఆరోపణలను నమ్ముతున్నారని, అందుకే సీబీఐ విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం  వైయ‌స్ జగన్‌కు మంచి పేరు రాకుండా చేయాలని ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా టీటీడీ విషయంలో అనేక ఆరోపణలు చేసిన విషయాలను ప్రస్తావించారు. శ్రీవారిని ఏసుగా మార్చామంటూ, దీపకాంతులను వేరే రకంగా చిత్రీకరించిన ఆరోపణలన్నింటినీ తప్పని నిరూపించామని స్పష్టం చేశారు. అయినా కావాలని ఆరోపణలు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమన్న చంద్రబాబు ఇవాళ అదే సీబీఐ విచారణ కోరుతున్నారని విమర్శించారు. అందుకే దీని వెనక ఎవరున్నారో, ఇలా చేయడం ఎవరికి అసవరమో ప్రజలు తెలియాలంటే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top