తాడేపల్లి: 2014–19 సమయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి తండ్రీకొడుకులు రూ.250 కోట్లు దోచుకున్నమాట వాస్తవం కాదా..? సీమెన్స్ కంపెనీలతో ఒప్పందం అని 5, 6 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు రూ.250 కోట్లు తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా..? నారా లోకేష్ సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. మంగళగిరిలో ఓడిపోయిన పనికిమాలినోడు నారా లోకేష్‌కు ప్రజలందరి నాయకుడు వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా..? లోకేష్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాదు.. మనిషే ఫెయిల్యూర్ అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. సీమెన్స్ కంపెనీ ఒప్పందం పేరుతో జరిగిన దోపిడీపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపట్టాలని, దోపిడీ దారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విలేరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
చంద్రబాబు, లోకేష్ ప్రవర్తన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కాదు కదా.. రెండు మూడు సీట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వాళ్లకు సంబంధించిన మీటింగ్‌లలో మహిళలు జై జగన్, కొంతమంది నిన్ను నమ్మం బాబు అంటున్నారు. ఏకంగా టీడీపీ కార్యకర్త ‘ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి రాజకీయం చేయడం కాదు.. వచ్చి ఆంధ్రరాష్ట్రంలో ఇల్లు కట్టుకొని రాజకీయం చేయండి.. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు జనం’ అని స్వయంగా చంద్రబాబును ఉద్దేశించి వాళ్ల మీటింగ్‌లలోనే చెప్పడం చూశాం.
చనిపోయిన దివంగత మహానేత వైయస్‌ఆర్ గురించి కూడా నారా లోకేష్, చంద్రబాబు వాళ్ల మీటింగ్‌లలో ప్రస్తావిస్తున్నారు. 24 కమిషన్లు వేసినా, విచారణలు వేసినా వైయస్‌ఆర్ కూడా మా అవినీతిని నిరూపించలేకపోయారని నారా లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటు. వైయస్‌ఆర్ బతికి ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతిపరుడు, దొంగ అని తెలిసినా, విచారణ రెండు అడుగులు ముందుకుపడితే చంద్రబాబు అరెస్టు అయితాడని తెలిసినా.. ఆరోజున చంద్రబాబు వెళ్లి వైయస్‌ఆర్ కాళ్లు పట్టుకుంటే జాలిచూపించి, అల్పుడిపై వజ్రాయుధాలు వేయడం ఎందుకని వదిలేసిన సంగతి అందరికీ తెలుసు.
నారా లోకేష్‌ను ఒక్కటే అడుగుతున్నా.. బాలకృష్ణ విషయంలో వైయస్‌ఆర్ చేసిన మేలు ఒక్కసారి గుర్తుచేసుకుంటే మంచిది. వైయస్‌ఆర్ చనిపోయిన తరువాత వీరులం, శూరులం అని చెబుతున్నారే.. ఆరోజున సోనియాగాంధీ, కాంగ్రెస్‌లోని పెద్దల కాళ్లు పట్టుకొని వైయస్ జగన్ ఏ తప్పు చేయకపోయినా కేవలం సాక్షిలోని పెట్టుబడులు చూపించి ఆరోజున కేసులు వేయించిన మాట వాస్తవం కాదా..? మీరెన్ని కుట్రలు చేసినా ప్రజా కోర్టులో సీఎం వైయస్ జగన్ గెలిచిన విషయం మరిచిపోయారా..? ఉప ఎన్నికల్లో 15 స్థానాల్లో, 2014 ఎన్నికల్లో 67 సీట్లు, 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ప్రజల న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి వైయస్ జగన్.
నారా చంద్రబాబు, లోకేష్, టీడీపీకి సూటి ప్రశ్న ఒకటి.. మీరు చేసిన స్కామ్‌లలో ఒక స్కామ్‌ను ఈరోజు బయటపెడుతున్నాం. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2014–19 సమయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి, సీమెన్స్ కంపెనీ పేర్లు వాడుకొని రూ.250 కోట్లు దోచుకున్నమాట వాస్తవం కాదా..? సీమెన్స్ కంపెనీతో ఒప్పందం అని 5, 6 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు రూ.250 కోట్లు తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా..? ఈరోజు ఏ మీటింగ్‌లోనైనా జాదూ రెడ్డి అని అవహేళనగా లోకేష్ మాట్లాడుతున్నాడు. రూ.250 కోట్లు ఏరకంగా మాయమైపోయాయో ఒక్కసారి లోకేష్ సమాధానం చెప్పాలి. జాదూ రెడ్డి కాదు.. జాదూ బాబు అంటే మంచిది. ఆ పదానికి తండ్రీకొడుకులు సరిగ్గా సరిపోతారు.
చంద్రబాబు ఏరోజూ నీతిపరుడు కాదు. చంద్రబాబు అవినీతిని నిరూపించాలని చూసినా ఆయన వెంటనే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నాడు. రాజధాని భూముల విషయంలో విచారణపై స్టే తెచ్చాడు. అచ్చెన్నాయుడు కుంభకోణంపై స్టే తెచ్చాడు. ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన సంగం డెయిరీ విచారణలో స్టే తెచ్చాడు. చంద్రబాబు అక్రమాస్తులపై నందమూరి లక్ష్మీపార్వతి పిటీషన్ వేస్తే దానిపై స్టే తెచ్చాడు. విదేశీ పెట్టుబడులపై విచారణ చేద్దామంటే దాన్ని జరగనివ్వకుండా చేశాడు. ఏలేరు కాల్వకు సంబంధించిన పరిహారం విషయంలో పోతిరెడ్డి అనే చంద్రబాబు వ్యక్తి పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసి నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం పోతిరెడ్డి అకౌంట్‌లో వేసి దోచుకున్న మాట వాస్తవం కాదా..? ఆరోజున జస్టిస్ లక్షా్మరెడ్డి ఇదే విషయంపై విచారణ చేపడితే టెక్నికల్ పరంగా కరెక్ట్‌గా లేదని విచారణను తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా..? ఇలా చంద్రబాబు గురించి చెప్పుకుంటూ పోతే వేల పుస్తకాలు అచ్చు వేయొచ్చు.
నారా లోకేష్ స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నారా లోకేష్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాదు.. మనిషే ఫెయిల్యూర్. నగరికి వెళ్లి రోజా గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడుతున్నాడు. పొలిటికల్ ఫీల్డ్‌లో ఉన్నవారు సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లి మూడు అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన తరువాత ఒక రోజు ప్రెస్‌మీట్ పెట్టి ఎన్టీఆర్‌కు యాక్షన్ రాదు.. నాగేశ్వరరావుకు, చిరంజీవికి యాక్టింగ్ రాదని మాట్లాడితే రాష్ట్రంలోని ప్రజలంతా ఎలా నవ్వుతారో ఆలోచించుకోండి. అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసి పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడుతారా అని అంటారు.
ఈరోజు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు ఇంతమందికి సీఎం వైయస్ జగన్ పొలిటికల్ లైఫ్ ఇచ్చారు. పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది పొలిటికల్ లీడర్లు సీఎం వైయస్ జగన్ పరిపాలనను మెచ్చుకుంటుంటే.. మంగళగిరిలో గెలవలేని ఒక పనికిమాలినోడు వచ్చి సీఎం వైయస్ జగన్ పరిపాలన, రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు. మంగళగిరిలో గెలవలేనోడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి.. టీడీపీని అధికారంలోకి తీసుకువస్తాడంట.
ఆర్కే రోజాను ఒక మహిళా అని కూడా చూడకుండా ఆమె ఇంటిపై దాడి చేయిస్తున్నాడు. ఎగతాళిగా మాట్లాడి జ్ఞానం ఉందని ప్రదర్శించాలనుకుంటున్నావేమో.. నువ్వు మాట్లాడేది చాలా ఎబ్బెట్టుగా, జీర్ణించుకోలేని విధంగా టీడీపీ కార్యకర్తలకే ఉంది. సీఎం వైయస్ జగన్ దేశంలోనే నంబర్ పొలిటిషియన్.. అయినప్పటికీ ఎప్పుడూ నేల విడిచి సాగు చేయలేదు. నిరంతరం రివ్యూ మీటింగ్‌లు, సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీస్తూ నిరంతరం తనను తాను సీఎం వైయస్ జగన్ అప్డేట్ చేసుకుంటున్నారు. ప్రజలకు ఇంకా ఎలా మేలు చేయగలం అని ఆలోచన చేస్తున్నారు. నిత్యం ప్రజల గురించే మా నాయకుడు ఆలోచన చేస్తున్నారు.
నెత్తిమీద రూపాయి పెడితే పావలాకు కూడా చెల్లని నారా లోకేష్ మాత్రం మా బ్లెడ్డు వేరు, మా బ్రీడు వేరు అంటున్నాడు. ఇటువంటివారి గురించి మనం ఆలోచన చేయాలా..? సీమెన్స్ కంపెనీతో వారు చేసుకున్న ఒప్పందంపై ఇప్పటికే అరెస్టులు జరిగాయి.. ఇంకా లోతుగా విచారణ జరగాలి. వీరందరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకూ నా విన్నపం ఒకటే... భ్రమల్లో బతకకండి.. వాస్తవాలకు అనుగుణంగా బతకండి.. తప్పుడు ప్రచారాలు చేసి వాటిని నిజం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈరోజు రాజకీయం చేస్తున్న యాక్టర్లు కూడా ఒకసారి ఉద్ధానం గురించి మాట్లాడారు. వారు మాట్లాడారు అంతే.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది మా నాయకుడు వైయస్ జగన్. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు, లోకేష్ లాంటివారిని శాశ్వతంగా రాజకీయం నుంచి దూరం చేయాలి. చంద్రబాబు లాంటి నాయకులు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం.