వైయ‌స్ జ‌గ‌న‌న్న ఉన్నంత వ‌ర‌కు ఎవ‌రూ.. ఏమీ చేయ‌లేరు

వైయ‌స్ఆర్ సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి
 

క‌ర్నూలు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెనుక ఉన్నంత వ‌ర‌కు న‌న్ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని వైయ‌స్ఆర్ సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి పేర్కొన్నారు. యువజ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌రువాత మొద‌టిసారి క‌ర్నూలు న‌గ‌రానికి విచ్చేసిన బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. న‌గ‌రంలో భారీ బైక్ ర్యాలీ చేప‌ట్టి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సిద్ధార్థ‌రెడ్డి మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాలుల‌ర్పించ్చారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..సిద్ధార్థ‌రెడ్డి వెనుక ఎవ‌రున్నార‌ని అంద‌రూ అనుకుంటున్నార‌ని, నా వెనకాల యువకులు, జగనన్న ఉన్నంతవరకు నన్ను ఎవరు ఏమి చేయలేర‌న్నారు. ఒక సామాన్యుడు, పేద‌వాడు, ఉద్య‌మాలు చేసిన వారు నాయ‌కులు కావాలి. దానికి మీ అంద‌రి స‌హాయ స‌హ‌కారం అవ‌స‌రం ఉంది.  నా వెనుక ఉన్న‌ది యోధుడు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని ధీమాగా చెప్పారు. ఆయ‌న బ‌తికి ఉన్నంత వ‌ర‌కు మ‌న‌కు ఎదురు ఉండ‌ద‌ని ఉద్ఘాటించారు. మీ అంద‌రి కోరిక మేర‌కే బైక్ ర్యాలీ నిర్వ‌హించాం. మీ సొంత కార్య‌క్ర‌మంగా భావించి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు. ఎన్ని జ‌న్మ‌లెత్తినా మీ రుణం తీర్చుకోలేన‌ని బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. న‌న్ను యువ నాయ‌కుడిగా చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మీ అంద‌రిని నాయ‌కులుగా చేశార‌ని గ‌ర్వంగా చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top