కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు

సినిమా హీరో పవన్.. రియల్ హీరో వైయ‌స్ జగన్.. 

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత ల‌క్ష్మీ పార్వ‌తి

చిత్తూరు:  సినిమా హీరో పవన్‌ కల్యాణ్‌.. రియల్ హీరో సీఎం వైయ‌స్‌ జగన్ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నేత‌ లక్ష్మీపార్వతి అభివ‌ర్ణించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీయార్ కుటుంబమే అన్నారు. మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు.. కుప్పంలో 35 ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారు.. వ్యవస్థను మెనేజ్‌ చేసి ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుప్పం వైపు దేశమంతా చూస్తోందన్న ఆమె.. స్వాతంత్ర్యం కూడా మేమే తెచ్చామని చంద్రబాబు అంటున్నారు.. 25 కేసులను పక్కదారి పట్టించి, న్యాయవ్యవస్థను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు కోవర్టులాగా రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, పురుందేశ్వరిలు వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.

  ప్రజలకు మేలు చేయాలనే తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ స్థాపించారన్నార‌ని లక్ష్మీపార్వతి తెలిపారు. చంద్రగిరిలో చిత్తుచిత్తుగా టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రబాబు ఓడిపోయారని గుర్తుచేసిన ఆమె.. 1994 ఎన్నికల్లో నేను, నా భర్త ఎన్టీయార్ తిరిగాము, అప్పుడు చంద్రబాబు ఎందుకు రాలేదు..? అని నిలదీశారు. మరోవైపు.. పురుంధేశ్వరి, భువనేశ్వరీ ఈర్ష ద్వేషానికి నా జీవితం, ఎన్టీయార్ జీవితం నాశనం అయిపోయిందన్నారు. లోకేష్ కు కనీసం మాట్లాడడానికి రాదు, అలాంటి వాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశారు..? అని ప్రశ్నించిన ఆమె.. ఇజ్రాయిల్ టెక్నాలజీ పేరుతో కుప్పంలోని రైతులను చంద్రబాబు మోసం చేశారు.. రాజధాని పేరుతో అమరావతిలోని రైతులకు చెందిన భూములను చంద్రబాబు కొట్టేశారు.. జగన్మోహన్ రెడ్డిని అనేక ఇబ్బందులు పెడుతున్నారు.. కానీ, 98 శాతం హామీలు అమలు చేసిన ఘనత  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిదే అన్నారు.

 
కుప్పంకు హంద్రీనీవా నీటిని వైయ‌స్ జగన్ అందించారని  లక్ష్మీపార్వతి తెలిపారు.. చంద్రబాబు అధికార దాహం కోసం తన మామను వెన్నుపోటు పొడిచారు.. చంద్రబాబును అరెస్ట్ చేసి, నిజాలు కక్కించాలన్నారు. కుప్పంలో చంద్రబాబు పై భరత్ గెలుస్తారని చాలా మంది బెట్లు కాస్తున్నారు.. ఒక దొంగను, వెన్నుపోటు దారుడిని కుప్పంలో భరత్ ఓడిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. లోకేష్ కు 60 కోట్లు పెట్టు సర్టిఫికెట్లను చంద్రబాబు కొనిచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీయార్ ట్రస్ట్ ను కాజేసావు.. ఎన్టీయార్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఏమీ చేశారు..? అని నిలదీశారు.. ఇక, ఆస్తుల్లో బిల్ గేట్స్ ను దాటిపోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.. నిజమైన విజనరీ నాయకుడు జగన్మోహన్ రెడ్డన్న ఆమె.. కాళ్లు పట్టుకొని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల పథకాలను కలిపి, కాపీ మానిపేస్టోను ప్రకటించారు.. మేనిఫెస్టోను నెరవేరుస్తామని బీజేపీ నాయకులకే నమ్మకం లేదని ల‌క్ష్మీ పార్వ‌తి ఎద్దేవా చేశారు 

Back to Top