కెనడాలో ఘనంగా వైయ‌స్ఆర్‌ సీపీ విజయోత్సవం

టొరంటో : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడాన్ని పురస్కరించుకుని కెనడాలోని టొరంటో నగరంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరుపుకున్నారు. వైయ‌స్ఆర్‌ సీపీ జెండాలు చేతపట్టి వైయ‌స్‌ జగన్‌ జై అంటూ నినాదాలు చేశారు. కేక్‌ కట్‌ చేసి జగన్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం నాగభూషణ్‌ రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, కృష్ణ అల్లంపాటి, మధుసూదన్, చంద్రహాస్‌ చల్ల, హరి మున్నంగి, వీరారెడ్డి, మోహన్‌రెడ్డి మల్లడి తదితరులు పాల్గొన్నారు.   
 
 

తాజా ఫోటోలు

Back to Top