రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వ కుట్రలు బట్టబయలు

పచ్చి అబద్దాలు చెప్పిన కూటమి నేతలు క్షమాపణ చెప్పాలి

పుత్తా శివశంకర్‌రెడ్డి డిమాండ్‌

వైయస్‌ఆర్‌సీపీ హయాంలో చేసిన అప్పులు రూ.3.39 లక్షల కోట్లు  

అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన కూటమి ప్రభుత్వం

అయినా ఎన్నికల నాటి నుంచి అదే పనిగా దుష్ప్రచారం

ఓట్ల కోసమే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం

రూ.14 లక్షల కోట్ల అప్పు అన్న దానిపై ఏం సమాధానం చెబుతారు?

ప్రెస్‌మీట్‌లో నిలదీసిన పుత్తా శివశంకర్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీల నేతలు చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్దమని శాసనసభ సాక్షిగా తేలిపోయిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, గత ఏడాది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.5,63,376 మాత్రమేనని ఆర్థికమంత్రి శాసనసభలో లిఖిత సమాధానం ద్వారా అంగీకరించారని తెలిపారు. అందుకే ఇప్పటి వరకు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు తమ అబద్దాలపై క్షమాపణ  చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 పుత్తా శివశంకర్‌ ఇంకా ఏమన్నారంటే..:

దారుణంగా విష ప్రచారం:
వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి, మరో శ్రీలంక అయిందంటూ కూటమి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు, పురంధేశ్వరీ కూడా దుష్ప్రచారం చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన తరువాత తాజాగా గవర్నర్‌ తోనూ అప్పులపై సమగ్ర సమాచారం లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం చేయించారు. ఓట్ల కోసం కూటమి పార్టీలు వైయస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు మోపారు. గత ప్రభుత్వం ఏకంగా రూ. 14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారు. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారు?.

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు:
    కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించిన వివరాల ప్రకారం.. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు రూ.2,34,225 కాగా, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పోరేషన్ల ద్వారా చేసిన అప్పు మరో రూ.1,05,355 కోట్లు. అంటే మొత్తంగా ఆ అయిదేళ్ళలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,39,580 కోట్లు మాత్రమే. అలాగే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.5,19,192 కోట్లు మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు మొత్తం రూ.12.93 లక్షల కోట్లు అంటూ ప్రకటించారు. ఇప్పుడు అసెంబ్లీలో వాస్తవ గణాంకాలు బయటపెట్టక తప్పలేదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి పార్టీలు ఎంతకైనా దిగజారుతాయనడానికి ఇదే నిదర్శనం అని పుత్తా శివశంకర్‌రెడ్డి గుర్తు చేశారు.

Back to Top