వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ ధర్మయుద్ధమే చేస్తుంది

మీడియా పాయింట్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయి

పలువురు అధికారుల తీరుపై అనుమానాలు ఉన్నాయి

వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు అలవాటే

అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలన్నది చంద్రబాబు ఆశ

చంద్రబాబు ఆశలు పగటి కలలుగానే మిగులుతాయి

గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది

మేం అధికారులపై ఒత్తిడి తెస్తే రిజల్డ్‌ ఇలా ఎందుకు వస్తుంది

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికపై న్యాయపోరాటం చేస్తాం

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ ధర్మయుద్ధమే చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని, పలువురు అధికారుల తీరుపై అనుమానాలు ఉన్నాయన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ పెద్ద పెద్ద నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు. ఒక్క బండిల్‌లోనే 6 ఓట్లు తేడా వచ్చింది. రీ కౌంటింగ్‌ అడిగే హక్కు మాకుంది.  ఆధారాలతో మేం కోరామన్నారు. దాదాపు 2 వేల బండిల్స్‌లో ఒక్కోక్క ఓటు తేడా వచ్చినా ఫలితాలు వేరుగా ఉంటాయన్నారు. రీ కౌంటింగ్‌ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

చంద్రబాబు రాష్ట్రంలోని 175 స్థానాలకు పోటీ పెడతానని ఎందుకు  అనలేకపోతున్నాడు. దత్తపుత్రుడు లేకుండా బయటకు ఎందుకు వెళ్లడం లేదు. టీడీపీ చరిత్రలో అన్ని స్థానాలకు పోటీ చేసింది లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవైనా అవకతవకలు జరిగాయని చంద్రబాబు అంటున్నాడు. ఐఏఎస్‌ అధికారులపై కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా  అనంతపురంలో అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని మేం ఫీలవుతున్నాం. అక్కడ ఆధారాలతో సహా మేం చూపినా పట్టించుకోలేదు. కౌంటింగ్లో కూర్చున్న వారిలో మా పార్టీ నుంచి ఏజెంట్లు , కార్యకర్తలు కూర్చుంటే..కడప నుంచి టీడీపీ తరఫున పెద్ద పెద్ద నాయకులు వెళ్లారు. అక్కడ టీడీపీ సీనియర్‌ నేతలకు ఏం పని. అక్కడ దబాయించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నేతల తీరు మారడం లేదు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం టీడీపీకి అలవాటైంది. ఇన్వాలిడ్‌ ఓట్లు ఎలా తీయాలని దబాయించి, అధికారులను బెదిరించారు. పైగా మమ్మల్ని అంటున్నారు. మేం అధికారంలో ఉండి కూడా మౌనంగానే ఉన్నాం. ఓట్లు అటు ఇటు ఎందుకు మార్చారు. 
ధర్మ యుద్ధం ఎలా చేయాలో దాన్ని చేయడమే వైయస్‌ఆర్‌సీపీ లక్షణం. రీ కౌంటింగ్‌ అడగాల్సిన అవసరం ఉందా ? లేదా? ఎన్నికల కమిషన్‌ నిబంధనలు మాత్రమే మేం హక్కుగా వాడుకున్నాం. ఇది సరైన పద్ధతి కాదా? మమ్మల్ని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం.  ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబే మర్డర్‌ చేస్తాడు. ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలను రాచి రంపాన పెట్టాడు. అందుకే ఆయనకు సరైన తీర్పు ఇచ్చారు. అయినా చంద్రబాబు తీరులో మార్పు రాలేదు. మేం అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం చేయాల్సి వస్తోంది. చంద్రబాబు ఈ రోజు అంబేద్కర్‌ మాటలు పలకడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఈ రోజు చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాటలో అధికార కాంక్ష, పగటి కలలు కంటున్నట్లుగా ఉంది. చంద్రబాబుకు ఆ కలలే మిగులుతాయి. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి మా ప్రాధాన్యాలుగా మేం పెట్టుకున్న వాళ్లు ఈ ఎన్నికలో పాల్గొనలేదు. ఎన్నికలు అంటే ఎంత సీరియస్‌గా ఉండాలో అంత సీరియస్‌గానే ఉంటాం. దీని గురించి చంద్రబాబు పాయింట్‌ అవుట్‌ చేయడం, ఆయనతో చెప్పించుకునే స్థాయిలో వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌సీపీ లేదు. 
చంద్రబాబు రిజెక్ట్‌ అయిన నాయకుడు, ఏ రోజైతే ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తానని బయటకు వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు..అసెంబ్లీకి వచ్చేది అసలే లేదు. ఆరోజే అనుకున్నాం..అసెంబ్లీలోకి వచ్చే అర్హతను కూడా చంద్రబాబు పోగొట్టుకున్నారని ..ఇంకా ఈ జీవితానికి చంద్రబాబు ఆ ఛాన్స్‌ పోయింది. చంద్రబాబు అక్కసు, కడుపు మంటను వెల్లగక్కెందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకున్నారు. ఎవరి పిచ్చి  వాళ్లకు ఆనందం. చంద్రబాబు మాటలకు మేం విలువ ఇవ్వడం లేదు. అవసాన దశలో భ్రమల్లో తృప్తి పొందితే ఆయనకు మంచిదే కదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ షాక్‌ నుంచి చంద్రబాబు ఇంకా తేరుకున్నట్లు లేదు. మూడు జిల్లాలకు సంబంధించి అనంతపురంలో ఓట్ల లెక్కింపు జరిగితే పులివెందుల రాజకీయం అక్కడ ఏముంది?. చంద్రబాబే సోషల్‌ మీడియాలో నాలుగు తప్పుడు ఆరోపణలు రాయించి శునకానందం పొందుతున్నాడు. అనంతపురంలో రిటర్నింగ్‌ అధికారులు ఎందుకు అలా వ్యవహరించారో అర్థం కావడం లేదు. గతంలో జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. చంద్రబాబు అప్పట్లో అడ్డంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మా పార్టీ నుంచి 23 ఎమ్మెల్యేలను లాకునేందుకు ఐఏఎస్‌ అధికారులను చంద్రబాబు అప్పట్లో వాడుకున్నారు. ఏబీ వెంకటేశ్వర్లు సంగతి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కూడా మీడియాకు తెలియదా?. మేం అధికారులపై ఒత్తిడి తెస్తే రిజల్డ్‌ ఇలా ఎందుకు వస్తుంది. మాపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రీ కౌంటింగ్‌పై లీగల్‌గా కూడా పోరాడుతామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

 

Back to Top