చంద్రబాబు కట్టే రాఖీ వేరే లెవెల్‌

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి సెటైర్లు

తాడేపల్లి:  ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా మరోసారి సెటైర్లు వేశారు. అది నేనే కట్టా..ఇది నేనే పెట్టా అంటూ చంద్రబాబు చెప్పే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కట్టే రాఖీ కట్టుకుంటే ఇంటర్‌లో బైపీపీ చదివి ఇంజినీర్‌ కావచ్చు. పోలీసు అయ్యి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయవచ్చు. ఆస్కార్‌ నామినేషన్స్‌కు వెళ్తే నోబెల్‌ ప్రైజ్‌ రావచ్చు అని చంద్రబాబు చెప్పారని సెటైర్లు వేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా పాల్గొనవచ్చని  అంటారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
 

Back to Top